Saturday 21 September 2013

సచివాలయంలో శవాల కంపులో


తెలుగుజాతికి 2 రాష్ర్టాలు
టీవీలో స్క్రోలింగ్

ఆయోమయం ఆఫీసరు
టూ ఎందుకు త్రీ అంటూ 
నాలుగు వేళ్లు చూపిస్తున్నాడు

ఆర్టీసీ కార్మికుడి వైపు
కేశినేని, దివాకర్ 
తీక్షణంగా  చూస్తున్నారు 

విడిపోతే పడిపోతమంటూ
ఊగిపోతున్నడో  గజల్ గాయకుడు 
అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామంటూ 
తెలుగుతల్లి విగ్రహం  ముందు  ఓ  ఉద్యమకారుడు
ట్యాంక్ బండ్ పై విగ్రహాలు ఒక్కసారిగా వణికాయ్


ఒక్కటిగా ఉంచండి... ఓట్లు లేకపోతే నోట్లు
బేరం పెట్టాడు ఓ నాయకుడు

రెండుగా విడగొట్టండి.. ఢిల్లీ పీఠం..కొడుక్కి పట్టం
ఎదురు బేరం పెట్టాడు మరో నాయకుడు



అమ్మగారి ముందు  ఆ ఇద్దరు  నాయకులు
చేతులు కట్టుకొని... తలల వంచుకొని 
నిలబడ్డారు.
కత్తితో  కొడుకు సిద్ధంగా ఉన్నాడు
అమ్మ ఇంకా లెక్కలు వేస్తూనే  ఉంది

హైదరాబాదు బస్సు ఎక్కాలా లేదా అని
శ్రీకాకుళంలో  అప్పలనాయుడు
బస్టాండులో  గిరగిరా తిరుగుతున్నాడు
ఇమ్లిబన్లో  అతడి కొడుకు కూడా

ఫార్మ్ హౌస్లో మెత్తటి  సోఫాలో
కొడుకు,కూతురు,అల్లుడు 

జైల్లో.. లోటస్ పాండులో
భార్య, తల్లీ, చెల్లీ

వైస్రాయ్లో, 22లక్షలింట్లో
కొడుకు కోడలు, బామ్మర్ది

సచివాలయంలో.. శవాల కంపులో
మరికొందరు

అప్షన్లపై కసరత్తు చేస్తున్నారు.












 




 









మోడి ఎక్కడా. వాజపేయి ఎక్కడా



రాములోరి పార్టీతో ఎన్టీవోడి పార్టీ  జత కడితే ఎలా ఉంటాదంటావ్
ఆళ్లు దూరమైపోతారేమోరా
ఛస్.. ఆళ్లేవరేయ్ అళ్లు దూరమైతే  కొంపలు మునిగిపోతయేటి
మునగడం సంగతి తెల్ద గానీ..ఓ పాలి ఓడిపోనాం..నీకు గుర్తు నేదేటి
నేకేం.. అందుకాళ్లేనేటి కారణం..
ఆళ్లేరా బాబూ... అందుకే ఓడిపోనాం.

ఐతే మరో పాలి దోస్తీ కట్టి గెల్లేదేటీ
అప్పడు వాజపేయి గోరున్నారు అందుకే..
మరిప్పడు మోడీ బాబు గోరు లేరేటి
బాగుంది మోడి గోడి ఎక్కడా, వాజపేయి గోరెక్కడా
నక్కకి కుక్కకి ఉన్నంత తేడా ఉందిరా బాబూ
నాకలా అనిపించడం లేదు
ఇటు రాముడు... అటు ఆంజనేయుడు

ఛస్.. నువ్వు  మరీ ఒఠ్టి ఎర్రిబాగులోడివిరా
మోడి మీద ఎలాంటి ముద్దరుందో నీకు తెలుసునా
ఎలాటిదేటీ. ఐనా ఉంటే ఏటి ఓట్లేయరేటీ
ఎన్ని సెప్పు ఆడితో జోడి కత్తి మీద సామురా బాబూ
మరి సాము చేయకుండా వచ్చేద్దేటి అధికారం

ఒరేయ్ మనలో మనకి గొడవలెందుగ్గానీ..
బాబు గోరి దగ్గరికెళదాం పద
యింటారంటావా
తస్సాదియ్యా నీకన్నీ అనుమానాలే.
బాబు గోరు చాణక్యుడు

Wednesday 26 December 2012

అమ్మా... ప్రతిభమ్మా మమ్మల్ని మాఫ్ చేయ్


ఎన్నన్నాం నిన్ను 
ఎంతలా ఆడిపోసుకున్నాం
ఇంతకుముందు ఎవరూ చేయనట్టు
ఇక ముందు ఎవరూ చేయరన్నట్లు 
తప్పైపోయింది తల్లీ .. ఇవిగో లెంపలు


President Pranab Mukherjee used just for an hour



Rs 37 lakh spent on room President Pranab Mukherjee used just for an hour
The government renovated the Circuit House ahead of President Pranab Mukherjee's visit.
BELGAUM: Rs 198 lakh of the taxpayers' money was spent when President Pranab Mukherjee was in Belgaum to inaugurate the Suvarna Vidhana Soudha in October.

The government renovated the circuit house (CH) ahead of President Pranab Mukherjee's visit. It spent over Rs 161 lakh on renovation and around Rs 37 lakh on furnishing the room, where Mukherjee spent just an hour on October 11.

RTI activist Bhimappa Gadad from Mudalagi in Gokak taluk sought information from the public works department on the expenditure incurred during the President's visit.

There are two Circuit House buildings in the same compound near the central bus stand. One was inaugurated two years ago. The old building and the compound was renovated during the World Kannada Meet (WKM) held in the city last year.

This before the government spent Rs 32 lakh in 2010-11 and Rs 18 lakh in 2011-12 for renovating the circuit house.

Tuesday 25 December 2012

అమ్మతో అన్న మాటే అన్నానే, బూతెలా అయిందబ్బా

ఠీక్ హై.. ఎంత సుందరమైన పదం
అదేదో సినిమాలో అంటాడు నానా పటేకర్.
ఏక్ మఛ్ఛర్  ఆద్మీ కో హిజడా బనాదేతాహై అని
అలా ఒక్క ఠీక్ హై..
ఎంత కష్టం తెచ్చింది మన ప్రధానికి



మన్మోహన్జీ, చిల్లర బిల్లు లాయియే
ఠీక్ హై మేడం
ప్రధానీజీ, అణు బిల్లు చాహియే
ఠీక్ హై మేడం
సింగ్జీ  ఘర్ కో  ఏక్బార్ ఆయియే
ఠీక్ హై మేడం


ఆ ఫ్లోలోనే ..    మూఢభక్తిలోనే
ఇక్కడా ఠీక్ హై అన్నాడు
అదే  తప్పైపోయింది జనానికి
ఎంత మాట ఎంత మాటంటున్నారు.
ఇన్నాళ్లూ అదే పదాన్ని ఎన్నిసార్లన్నా 
ఏమీ అనని జనం ఇప్పడు కళ్లెర్రచేస్తున్నారు.


అలవాట్లో పొరపాటని,
ఆటలో అరటిపండని,
కూరలో కరేపాకని ,
వదిలేడంలేదు.
అందలాన్ని అందించిన పదంపై
అమ్మకు సంతోషాన్నిచ్చిన పదంపై
నిప్పులు చెరగుతున్నారు

ఏం చేస్తాం, ఠీక్ హై .




ఓడితే ఓడారు గాన్రా



ఆడేవడో భువనేశ్వరట
ఏమేశాడు, ఏమేశాడు
కుమ్మేశాడు
3 ఓవర్లు 9 పరుగులు
ఇన్స్వింగ్  అవుట్స్వింగు
ఇరగదీశాడు
వీడూ యూపీ కుర్రానేనట
అందుకే తాగుబోతు ప్రవీణ్ లానే
స్వింగ్ తో చిందేశాడు
 


 



Monday 24 December 2012

బావా.. అదిగో మోడీ పురి, అదిగో అధికారం

బావా.. అదిగో మోడి పురి. 
అదిగో  2014లో మన అధికారానికి సాయపడే కాషాయదళం
అదిగో  సదా మన సేవలోనే  తరించే వెంకయ్య నాయుడు
అదిగో మన మేలు కోరే పెద్దాయన అద్వాని
అదిగో మనకు ఓట్లు తెచ్చే లడ్డూ నరేంద్రభాయ్ 
అదిగో 99లో మన వెంట నడిచిన నాయకగణం

వెళ్లమందువా బావా,  మోడీ పురి వెళ్లమందువా
వెళ్లి  నాటి చెలిమిని మళ్లీ ఓ సారి గు్తు చేయమందువా
చేసుకున్న బాసలు చెరిగిపోవనీ,
అధికారంపై శలు మెండుగా ఉన్నవనీ,
2014లోని మనతోనే నడవమనీ
కాషాయం, పసుపు ఒకటేననీ,.
ఎన్నటికీ విడిపోని జంట మనదేననీ
లౌకికవాదం ఓ ముసుగేననీ.
అధికారమే పరమావధి అనీ

నీ మాటగా వారికి చెప్పి,
రమ్మందువా బావా. 
 






షిండే వాకిట్లో తెలంగాణ చెట్టు



తోడు దొంగలు సినిమా చూశారా
ఇద్దరు దొంగలుంటారు.
కలిసే దొంగతనాలు చేస్తా ఉంటారు
దోచుకున్నదీ కలిసే  పంచుకుంటా ఉంటారు.
ఏంటీ చూడలేదా. చూశారుగానీ. 
అలా ఉండదంటారా
్చ్...  సినిమా పేరలా ఉంది కాబట్టి
కథా అలానే ఉంటుందనుకున్నా
అడ్డం తిరిగినట్టుంది.


పోనీ అఖిలపక్షం నాటకం ఎప్పడైనా చూశారా
ఢిల్లీలో ఆడతా ఉంటాది. హోం మంత్రి ఆడిస్తా ఉంటాడు
ఒక్కో పార్టీ తరఫున ఇద్దరు వెళతా  ఉంటారు.
వెళ్లిన ఇద్దరూ  వేర్వేరు మాటలు చెబుతా ఉంటారు. అయినా
పక్కపక్కనే కూర్చోని కుళ్లు జోకులేసుకుంటా ఉంటారు.
నాటకం ఆడించేవాళ్లు  కూడా ఆ జోకులకు 
విరగబడి నవ్వుతూ.. తెర దించేస్తా ఉంటారు.

చూడ్లేదా... 28న మళ్లీ మీ కోసం వేస్తున్నారు. 


నాటకం పేరు; షిండే వాకిట్లో తెలంగాణ చెట్టు
చిరునామా, నార్తు బ్లాకు.  న్యూఢిల్లీ